Sunday, December 30, 2012

ఇరుక్కుపోయిన పిల్లి - సమీర చెప్పిన కథ


ఒక ఊరులో ఒక పిల్లి, ఎలుక, కుక్క ఉండేవి. ఒక సారి పిల్లికి ఎలుక తినాలనిపిచ్చింది. కానీ ఎలుక ఎప్పుడూ తప్పిచ్చుకునేది.
అందుకే ఒక సారి పిల్లి కుక్క దగ్గరికి వెళ్లింది. "నాకొక ట్రాప్ పెడతావా?"  అనడిగింది.
"ఎందుకు?" అంటే- కుక్క అడిగింది.

సమీర, మూడవ తరగతి
"ఎందుకంటే ఎలుకని కాచ్ పట్టుకోవడానికి " అంది పిల్లి.
"సరే"  అని ఇద్దరూ పెట్టారు.
తర్వాత ఎలుకను పట్టుకుంది, తినేసింది పిల్లి.
అప్పుడు కుక్క అడిగింది " నేను నీకు సహాయం చేసా గాబట్టి , నాకు నువ్వు సహాయం చేస్తావా? " అనడిగింది కుక్క.
"సరే ఏంటి నీ సహాయం చెయ్యాలి? " అనడిగింది పిల్లి.
" నేను నిన్ను తింటానూ "  అంది కుక్క.  " అయ్యయ్యో, నేను ఇరుక్కు పొయ్యాను " అని  పిల్లి బాధ పడింది .  అందుకనే మంచి వాళ్లతోనే స్నేహం చెయ్యాలి. ఇదీ నా కథ.
.............................

Monday, December 3, 2012

నేను- నా కల (ఇందు చెప్పిన కథ)





ఇందు -  నాలుగవ తరగతి

నేను మా అమ్మకు, నాన్నకు "బాయ్" చెప్పాను.  టాక్సీ అర్థ రాత్రి చీకట్లోకి వెళ్లిపోయింది. అవును, ఇప్పుడు అర్థ రాత్రి అయ్యింది. మా అమ్మ, నాన్న నన్ను ఇవాళ లేట్ గా పడుకోనిస్తారు. ఎందుకంటే రేపు శనివారం. స్కూలు కి సెలవ. తొందరగా నేను లేవక్కర లేదు. నేను లోపలికి వెళ్లి పడుకున్నాను.

పొద్దున్న సూర్యకాంతి నా  కిటికీ లోంచి గది లోకి పడుతోంది. నేను ఎప్పుడూ పక్షులతో పాటు లేస్తాను. కానీ ఇవేళ నేను లేట్ గా లేచాను. నిన్న రాత్రి అర్థ రాత్రికి పడుకున్నాను. అందుకే లేట్ గా లేచాను. మంచం నించి లేచి, మొహం కడుక్కుని, స్నానం చేసాను. క్లాజట్ లోకి వెళ్లి డ్రెస్ తీసుకొచ్చాను.  క్లాజట్ లో నించి బయటికి వెళ్తూ ఉంటే  క్లాజట్ వెనకాల ఒక మెరిసే క్రిస్టల్ చూసాను. అది ఒక డోర్ నాబ్. అందులో నుంచి లోపలికి వెళ్లాను. వావ్! లోపలేమో ఒక స్నో ఫారెస్ట్ చూసాను. నేను చాలా సేపు స్నో తో ఆడుకున్నాను.  నాకు స్నో అంటే చాలా ఇష్టం. కొంచెం సేపు తర్వాత నా చుట్టూ స్నో మాయమైపోయింది. "ఇదేంటి" నేను అనుకున్నాను. సడెన్ గా నేను లేచాను. నేనింకా మంచమ్మీద ఉన్నాను. ఇదంతా ఒక కల. ఇది నా కథ.  
.....................