Sunday, December 30, 2012

ఇరుక్కుపోయిన పిల్లి - సమీర చెప్పిన కథ


ఒక ఊరులో ఒక పిల్లి, ఎలుక, కుక్క ఉండేవి. ఒక సారి పిల్లికి ఎలుక తినాలనిపిచ్చింది. కానీ ఎలుక ఎప్పుడూ తప్పిచ్చుకునేది.
అందుకే ఒక సారి పిల్లి కుక్క దగ్గరికి వెళ్లింది. "నాకొక ట్రాప్ పెడతావా?"  అనడిగింది.
"ఎందుకు?" అంటే- కుక్క అడిగింది.

సమీర, మూడవ తరగతి
"ఎందుకంటే ఎలుకని కాచ్ పట్టుకోవడానికి " అంది పిల్లి.
"సరే"  అని ఇద్దరూ పెట్టారు.
తర్వాత ఎలుకను పట్టుకుంది, తినేసింది పిల్లి.
అప్పుడు కుక్క అడిగింది " నేను నీకు సహాయం చేసా గాబట్టి , నాకు నువ్వు సహాయం చేస్తావా? " అనడిగింది కుక్క.
"సరే ఏంటి నీ సహాయం చెయ్యాలి? " అనడిగింది పిల్లి.
" నేను నిన్ను తింటానూ "  అంది కుక్క.  " అయ్యయ్యో, నేను ఇరుక్కు పొయ్యాను " అని  పిల్లి బాధ పడింది .  అందుకనే మంచి వాళ్లతోనే స్నేహం చెయ్యాలి. ఇదీ నా కథ.
.............................

Monday, December 3, 2012

నేను- నా కల (ఇందు చెప్పిన కథ)





ఇందు -  నాలుగవ తరగతి

నేను మా అమ్మకు, నాన్నకు "బాయ్" చెప్పాను.  టాక్సీ అర్థ రాత్రి చీకట్లోకి వెళ్లిపోయింది. అవును, ఇప్పుడు అర్థ రాత్రి అయ్యింది. మా అమ్మ, నాన్న నన్ను ఇవాళ లేట్ గా పడుకోనిస్తారు. ఎందుకంటే రేపు శనివారం. స్కూలు కి సెలవ. తొందరగా నేను లేవక్కర లేదు. నేను లోపలికి వెళ్లి పడుకున్నాను.

పొద్దున్న సూర్యకాంతి నా  కిటికీ లోంచి గది లోకి పడుతోంది. నేను ఎప్పుడూ పక్షులతో పాటు లేస్తాను. కానీ ఇవేళ నేను లేట్ గా లేచాను. నిన్న రాత్రి అర్థ రాత్రికి పడుకున్నాను. అందుకే లేట్ గా లేచాను. మంచం నించి లేచి, మొహం కడుక్కుని, స్నానం చేసాను. క్లాజట్ లోకి వెళ్లి డ్రెస్ తీసుకొచ్చాను.  క్లాజట్ లో నించి బయటికి వెళ్తూ ఉంటే  క్లాజట్ వెనకాల ఒక మెరిసే క్రిస్టల్ చూసాను. అది ఒక డోర్ నాబ్. అందులో నుంచి లోపలికి వెళ్లాను. వావ్! లోపలేమో ఒక స్నో ఫారెస్ట్ చూసాను. నేను చాలా సేపు స్నో తో ఆడుకున్నాను.  నాకు స్నో అంటే చాలా ఇష్టం. కొంచెం సేపు తర్వాత నా చుట్టూ స్నో మాయమైపోయింది. "ఇదేంటి" నేను అనుకున్నాను. సడెన్ గా నేను లేచాను. నేనింకా మంచమ్మీద ఉన్నాను. ఇదంతా ఒక కల. ఇది నా కథ.  
.....................

Thursday, November 1, 2012

రాజు గారు వర్షం- నీహారిక చెప్పిన కథ


నీహరిక, ఒకటవ తరగతి

అనగనగా ఒక రాజు గారు ఉన్నారంట. ఆ రాజు గారికి ఒక పెద్ద భవనం ఉందంట. ఆ భవనంలో వర్షాలు పడట్లేదంట.
వర్షాలు పడక పోతే పక్కనే ఇంకో ఇల్లుందంట. ఆ ఇల్లుకి లాప్ టాప్ ఉందంట. దాంట్లో చూసినప్పుడు వర్షాలు లేవంట.
వర్షాలు లేపోతే.. సడెన్లీ ఒక వర్షం పడిందంట. కానీ రాజు గారు ఆ వర్షం ముందరే అన్నీ సామాన్లు తెచ్చేసుకున్నారంట.  
ఇదే నా కథ.

Monday, October 1, 2012

మోసమైన సింహం- శివాని చెప్పిన కథ




శివాని- నాలుగవ తరగతి
అనగనగా ఒక ఊర్లో ఎవరో ఒక భవనం కొనుక్కున్నారట. వాళ్లు కూర్చుని మాట్లాడుకుంటున్నారట.
 సడెన్లీ ఒక పెద్ద చప్పుడు వచ్చింది. వాళ్ల నాన్న మెట్లెక్కి ఒక గదిలో చూసారు. తీరా చూస్తే ఒక పెద్ద సింహం ఉందంట.
 వాళ్లు భయపడి కిందికి వాళ్లు దాక్కున్నారు. ఆ సింహం వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూ ఉండి తీరా చూస్తే వాళ్లు ఒక క్లాజెట్ లో దాక్కుంటున్నారంట.
ఆహా! దొరికారూ! అని మెట్లు దిగి ఆ క్లాజెట్ లో ఆ నాన్నని లాగింది.
"మీ పాపను ఇస్తావో or మీ అందర్నీ తొందర తొదరగా తినేస్తాను" అని బెదిరిచ్చింది.
"సరే- మేం మా పాపను ఇస్తాము- రేప్రొద్దున్న" అంటే
"ఊ! సరే నేనెదురు చూస్తానని వెళ్లిపోయింది.
 ఆ రాత్తిర ఒక షాప్ కెళ్లి ఒక పాప బొమ్మ కొన్నారు.
వాళ్ల నిజం పాపని దాచేసారా ప్రొద్దున్న.
ఆ సింహం వచ్చి వాళ్లని లేపి, "ఆ! మీ పాపేది? నాకిస్తారన్నారు?" అంది సింహం.
ఆ తర్వాత వాళ్లు "ఇదుగో మా పాప అని Pretend చేసేరు." ఏడుస్తూ ఉన్నారు.
  "ఉహుహూ ! ధన్యవాదాలు-" అని అడివికి వెళ్లిపోయింది.
కొన్ని సంవత్సరాల తర్వాత అదొక బొమ్మ అని తెల్సింది.
అయ్యో! నేను బొమ్మను తిన్నానా! అయ్యో " నో " అని చచ్చిపోయింది. అదీ కథ-

                                      .........................

Monday, September 3, 2012

గురువు గారు- శిష్యురాలు(అమెరికా బాలల తెలుగు హాస్య నాటిక)




గురువు గారు(guruvu garu)- ఆత్రేయ(ఏడవ తరగతి)

శిష్యురాలు (Shishyuralu)- శ్రీకరి(ఐదవ తరగతి)

రచన, దర్శకత్వం, పర్యవేక్షణ - డా|| కె.గీత

Thursday, August 16, 2012

Oka Manchi Puli- Ramya cheppina Katha

రమ్య సంతోషి, 2వ తరగతి
    ఒక మంచి పులి   -రమ్య చెప్పిన కథ





                                  అనగనగా ఒక ఊరిలో ఒక అబ్బాయి పులి  ఉంటాడు. ఆ అబ్బాయి పులికి ఇద్దరు అన్నలు ఉంటారు. ఆ అన్నలు ఎప్పుడూ అబ్బాయి పులిని కొడుతున్నారు, తిడుతున్నారు. సెలవల్లో ఆ అన్నలు ఇంకో  అడవికి వెళ్తారు. అప్పుడు అబ్బాయి పులి ఇంట్లో ఉంటాడు. అప్పుడు ఒక అమ్మాయి పులి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్లి " నేను పూజ చెయ్యాలి, నాకు పూజ చెయ్యటం రాదు. నువ్వు నేర్పిస్తావా?"అడిగాడు. అప్పుడు అమ్మాయి పులి నేర్పిచ్చాక అబ్బాయి పులి ఇంటికి వెళ్లి స్నానం చేసి పూజ చేస్తాడు.  అప్పుడు బయటికి వెళ్తాడు. అప్పుడు దేవుడు కిందికి వచ్చి అబ్బాయి పులి అన్నలకి దగ్గర  వచ్చి "ఎందుకు మీ తమ్ముణ్ని తిడుతున్నారు? తిడితే నేను వచ్చి కొడతాను." చెప్పేసి వెళ్తాడు. అప్పుడు అన్నలు ఇంటికి వెళ్లి "సోరీ" చెప్పి    గుడ్ ఫ్రెండ్స్ అవుతారు.
 అయి పోయింది కథ-