రమ్య సంతోషి, 2వ తరగతి |
అనగనగా ఒక ఊరిలో ఒక అబ్బాయి పులి ఉంటాడు. ఆ అబ్బాయి పులికి ఇద్దరు అన్నలు ఉంటారు. ఆ అన్నలు ఎప్పుడూ అబ్బాయి పులిని కొడుతున్నారు, తిడుతున్నారు. సెలవల్లో ఆ అన్నలు ఇంకో అడవికి వెళ్తారు. అప్పుడు అబ్బాయి పులి ఇంట్లో ఉంటాడు. అప్పుడు ఒక అమ్మాయి పులి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్లి " నేను పూజ చెయ్యాలి, నాకు పూజ చెయ్యటం రాదు. నువ్వు నేర్పిస్తావా?"అడిగాడు. అప్పుడు అమ్మాయి పులి నేర్పిచ్చాక అబ్బాయి పులి ఇంటికి వెళ్లి స్నానం చేసి పూజ చేస్తాడు. అప్పుడు బయటికి వెళ్తాడు. అప్పుడు దేవుడు కిందికి వచ్చి అబ్బాయి పులి అన్నలకి దగ్గర వచ్చి "ఎందుకు మీ తమ్ముణ్ని తిడుతున్నారు? తిడితే నేను వచ్చి కొడతాను." చెప్పేసి వెళ్తాడు. అప్పుడు అన్నలు ఇంటికి వెళ్లి "సోరీ" చెప్పి గుడ్ ఫ్రెండ్స్ అవుతారు.
అయి పోయింది కథ-